యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలోని భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.
స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కొండపైన ఉన్న బస్ బస్టాండ్, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది.
ఇక ఏప్రిల్ 8 శనివారం రోజున నారసింహస్వామిని దాదాపుగా 30వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. దీంతో వివిధ రకాల కానుకాల ద్వారా రూ.51,62,780 ఆదాయం వచ్చిందని తెలిపారు.