వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో స్నానం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా క్యూలైన్లు, ప్రసాద కౌంటర్స్ భక్తులతో నిండిపోయాయి.
స్వామివారి దర్శనానికి రెండు గంటల టైం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామి వారికి కోడెలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు చర్యలు చేపట్టారు.