తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి.
భక్తుల తాకిడి పెరగడంతో అధికారులు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేశారు. ఆదివారం హైకోర్టు జడ్జి చంద్రశేఖర్‌రావు, ప్రముఖ బ్యాడ్మింటన్ప్లేయర్ శ్రీకాంత్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, వరంగల్ డీఎంహెచ్‌వో సాంబశివరావు తదితరులు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు.