
కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ భారీగా ఉండటంతో లఘు దర్శన ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు.
కార్తీక సోమవారం సందర్బంగా శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజామునుంచే పాతాళగంగలో స్నానాలు ఆచరించి.. ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు మహిళలు. ఉచిత దర్శనానికి 5 గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటలకుపైగా టైమ్ పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పర్శ, వీఐపీ దర్శనాలు రద్దు చేశామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు.