వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనానికి 3 నుంచి 4 గంటలకు సమయం పడుతోంది. డ్యూటీలు పక్కన పెట్టి పోలీసులు తమ బంధువులు, వీఐపీలకు సేవ చేస్తుడండంతో ఉదయం నుండి క్యూలైన్లలో ఉన్న భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. తొందరగా అమ్మవారి దర్శనం చేయించాలని చిన్నపిల్లల తల్లులు, వృద్దులు పోలీసులను వేడుకుంటున్నారు.
వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.