అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 15వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఏఈఓ శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందిపడ్డారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే పూజలు

కొండగట్టు అంజన్నను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మంగళవారం కుటుంబ సమేతంగా దర్శంచుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి పూజలు చేయించారు.