వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని, స్వామి వారికి ఇష్టమైన కోడెమొక్కులను చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్, కోడెమొక్కుల క్యూలైన్‌తోపాటు ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు.
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
అటు శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారంతో పాటు దసరా సెలవులు కూడా ముగుస్తుండటంతో భారీగా భక్తులు మల్లన్న దర్శనానికి వస్తున్నారు. క్యూలైన్లతో పాటు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి వేచి చూస్తున్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 4గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.