శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణతో మార్మోగుతోంది. తెల్లవారు జామునుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు. దర్శనానికి దాదాపు 3 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

భక్తులు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. క్యూలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తుల కోసం అల్పాహారం, తాగు నీరు అందిస్తున్నామన్నారు.