తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. ఇక 3 వందల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కొండపై ఎటూ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. 

మరో రెండు రోజులపాటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. నిన్న స్వామివారిని 84 వేల 878 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 41,016 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లు.