
కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తలు ఆలయాలకు పొటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలం, భద్రాచలం, శ్రీకాళహస్తి,ద్రాక్షారామం, వేములవాడ, వరంగల్, వేయిస్తంభాలగుడి, రామప్ప, కీసర ఆలయాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
కార్తీ్కమాసం సందర్భంగా యాదాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. ఉదయం నుండి సత్యనారాయణ స్వామి పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కార్తీ్కమాసం సందర్భంగా తిరమలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శానానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70 వేల 350 మంది భక్తులు దర్శి్ంచుకోగా.. హుండి ఆదాయం రూ. 3.11 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.