మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ కెథడ్రల్ చర్చికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులు రావడంతో చర్చి ఆవరణతో పాటు ఖాళీ ప్రదేశాల్లో భక్తుల సందడి కనిపించింది. ఉదయం చర్చిలో శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్‌‌చార్జి శాంతయ్య, పాస్టర్లు, భక్తులకు దైవసందేశాన్ని అందించారు. పిల్లలు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. అనంతరం భక్తులు చర్చిఆవరణలో టెంట్లు వేసుకొని వంటలు చేసుకుని ఆనందంగా గడిపారు.