యాదగిరిగుట్టలో భక్తుల సందడి..దర్శనానికి 3 గంటల సమయం

యాదాద్రి భువనగిరి:  యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. ఆదివారం  సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివస్తున్నారు భక్తులు.

రద్దీ కారణంగా ఉచిత ధర్మదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా..  ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, పార్కింగ్ ప్రదేశం..కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో వేసవి తాకిడికి ఇబ్బంది పడకుండా చలవ పందిరిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.