వరుసగా సెలవులు.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

వరుసాగా రెండు రోజులు సెలవులు రావడంతో యాదాద్రి ఆలయానికి భక్తులు  పోటెత్తారు. డిసెంబర్ 24 ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజామునుంచే భక్తులు యాదగిరి గుట్టకు తరలివస్తున్నారు. 

లక్ష్మీనరసింహా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తుండడంతో..క్యూలైన్ లతో పాటు ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. దీంతో 150 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల  సమయం, ఉచిత దర్శనంకి 4 గంటల  సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వరుసగా సెలవులతో వరంగల్ భద్రకాళి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. అమ్మ వారాలను దర్శించుకునెందుకు  భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి పట్నాలు, బోనాలు సమర్పించి  దర్శించుకుంటున్నారు.