రూ.లక్ష 20 వేల టీవీ కేవలం రూ.49 వేలకే.. మరో రెండు రోజులే ఛాన్స్..!

హైదరాబాద్: టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు కొనాలకునే వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ భారీ శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘‘అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2025’’ సేల్ ప్రారంభించింది. స్మార్ట్‌‌ఫోన్‌‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఎసెన్షియల్స్, కిరాణా సామగ్రి, అప్లయన్సెస్​పై 80 శాతం తగ్గింపు ఇస్తామని అనౌన్స్ చేసిన అమెజాన్.. మొబైల్ యాక్సెసరీస్‎పై 80శాతం, ల్యాప్‌‌టాప్‌‌లపై 40శాతం, ఎలక్ట్రానిక్స్‌‎పై 75శాతం, ఫ్యాషన్​వస్తువులపై 80శాతం, నిత్యావసర వస్తువులపై 50శాతం,  పుస్తకాలు, బొమ్మలు, గేమింగ్ యాక్సెసరీస్‎లపై 70శాతం తగ్గింపు ఇస్తామని అమెజాన్ ప్రకటించింది. 

2025, జనవరి 13 నుండి మొదలైన ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. 2025, జవనరి 19న ముగియనుంది. ఈ సేల్‎లో ముఖ్యంగా టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. రూ. 1,19,990 విలువ చేసే టీవీని గ్రేట్ రిపబ్లిక్ సేల్‎లో భాగంగా కేవలం రూ. 49,490కే అందిస్తోంది. అమెజాన్ పే కార్డుతో 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు. 

ALSO READ | మొదలైన అమెజాన్​ రిపబ్లిక్ డే సేల్​

ఎస్​బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్​స్టంట్​డిస్కౌంట్ ఉంటుంది. ప్రైమ్ సభ్యులు కో–-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే రూ. 2,500 విలువైన వెల్‌‌కమ్ రివార్డ్‌‌లను పొందవచ్చు. ఇవి అప్లై చేస్తే టీవీ ధర మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉంది. సో.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ముగియడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ టీవీ కావాలనుకునే వారు వెంటనే కొనుగోలు చేయొచ్చు. 

రూ.50 వేల లోపు బెస్ట్ ఆఫర్ ఉన్న టీవీల వివరాలు:

  • Hisense 4K అల్ట్రా HD స్మార్ట్ QLED  టీవీ అసలు ధర.. రూ. 79,999.. తగ్గింపు ధర  రూ. 49,999
  • Samsung D సిరీస్ క్రిస్టల్ 4K TV అసలు ధర.. రూ. 78,900..  తగ్గింపు ధర రూ. 49,990
  • Acer XL సిరీస్ అల్ట్రా HD LED TV అసలు ధర.. రూ. 59,990.. తగ్గింపు ధర రూ. 49,499
  • LG 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV అసలు ధర.. రూ. 71,990.. తగ్గింపు ధర రూ. 48,990
  • Xiaomi X Pro QLED సిరీస్ స్మార్ట్ Google TV అసలు ధర.. రూ. 70,999.. తగ్గింపు ధర రూ. 47,999