తమిళ హీరో దళపతి విజయ్(Vijay thalapathy), సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) కాంబినేషన్ లో వచ్చిన సినిమా లియో(Leo). సాంగ్స్ అండ్ ట్రైలర్ భారీగా అంచనాలు పెంచిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మొదటి షో నుండే డివైడ్ టాక్ వచ్చింది. స్టైలీష్ యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు సినిమా బాగుందని అంటుంటే, లోకేష్ టేకింగ్, కథ, ప్రెజెంటేషన్ కోసం వెళ్లిన వాళ్లు డిజప్పాయింట్ అవుతున్నారు.
- ALSO READ | Leo First day collections: వామ్మో.. ఆ కలెక్షన్స్ ఏందీ సామి!?.. లియో దెబ్బకు రికార్డ్స్ అన్నీ బ్రేక్
అయితే టాక్ ఎలా ఉన్నా మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది లియో మూవీ. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఏకంగా రూ.142 కోట్ల వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే విజయ్ హీరో అవడం, భారీ అంచనాలు ఏర్పడటంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అయితే రెండోరోజు మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది పరిస్థితి. లియో బుకింగ్ భారీగా తగ్గిపోయాయి. కారణం.. లియో సినిమా టాక్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే.
దీంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో.. సెకండ్ డే కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే మధురై లాంటి సెంటర్స్ లో బుకింగ్స్ నలభై శాతానికి పడిపోయాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి బుకింగ్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు రవితేజ టైగర్ నాగేశ్వర రావు కూడా రిలీజ్ అయ్యింది కాబట్టి.. లియో బుకింగ్స్ మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా.. లియో మొదటి రోజు కలెక్షన్స్ తో పోల్చుకుంటే... రెండవరోజు 50% శాతానికి పైగా కలెక్షన్స్ డ్రాప్ అవనున్నాయని సమాచారం. మరి ఈ రెండు సినిమాల పోటీని విజయ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.