కరేబియన్ సముద్రంలో భారీ భూ కంపం.. సునామీ హెచ్చరిక జారీ

కరేబియన్ సముద్రంలో భారీ భూ కంపం.. సునామీ హెచ్చరిక జారీ

కరేబియన్ సముద్రంలో శనివారం (ఫిబ్రవరి 8) భారీ భూ కంపం సంభంవించింది. రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. హోండురాస్‌కు ఉత్తరాన కరేబియన్ సముద్రంలో 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. భూ కంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. 2021లో హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపమని యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

కరేబియన్ సముద్రంలో భూ కంపం సంభవించిన నేపథ్యంలో ప్యూర్టో రికో, వర్జిన్ దీవులు, యూఎస్ అట్లాంటిక్, గల్ఫ్ తీరంలో సునామీ వచ్చే అవకాశం ఉందని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ హెచ్చరించింది. కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, కోస్టారికా, హోండురస్, నికరగువ, క్యూబా దేశాలపై ఈ భూ కంపం ప్రభావం చూపించింది. భూ కంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలను అలర్ట్ చేశాయి.