సిరియాలో భారీ పేలుడు..19 మంది మృతి

సిరియాలో భారీ పేలుడు..19 మంది మృతి

డమాస్కస్: సిరియాలో కారు బాంబు పేలడంతో 19 మంది మరణించారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు. సోమవారం ఉత్తర సిరియా సిటీ శివార్లలో ఈ పేలుడు సంభవించింది. వ్యవసాయ కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం పక్కనే కారు బాంబు పేలింది. దీంతో 18 మంది మహిళలు సహా మొత్తం 19 మంది చనిపోయారు.  మరో 15 మంది మహిళలకు గాయాలయ్యాయని పేర్కొంది. 

పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించింది. ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ఏ టెర్రరిస్టు సంస్థ కూడా ప్రకటన చేయలేదు. గతేడాది డిసెంబర్‎లో సిరియా ప్రెసిడెంట్‎గా బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మన్ బిజ్ సిటీలో తరచుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.