రష్యాలో గ్యాస్‌ స్టేషన్‌లో పేలుడు 13 మంది మృతి

రష్యాలో గ్యాస్‌ స్టేషన్‌లో పేలుడు 13 మంది మృతి

మాస్కో: రష్యాలోని గ్యాస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. సౌతర్న్‌ రీజియన్‌లోని డాగేస్తాన్‌ ప్రాంతంలో ఉన్న సర్వీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మఖచ్కల శివారులోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు పేలుడు జరగడంతో ఆ పక్కనున్న కేఫ్‌టేరియాకు కూడా అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 13 మంది మరణించారని తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్‌‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.