బుద్వేల్‎లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM

రంగారెడ్డి జిల్లా మైలార్‎దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‎లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం (జవనరి 11) రాత్రి మహా మంగళ కార్టూన్ వేస్టేజ్ గోదాంలో పార్కింగ్ చేసి ఉన్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. క్షణాల్లో మంటలు అంతటా వ్యాపించి.. డీసీఎం అగ్నికి ఆహుతైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో గోడౌన్‎తో పాటు అగ్నికి ఆహుతైన డీసీఎంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించనప్పటికీ.. భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటన్నదానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గోడౌన్ యాజమానితో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.