జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోరుట్ల పట్టణంలోని గడి బురుజుల వద్ద సుఫియన సామీల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ శివారులోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హిందూస్థా్న్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై డిజీల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.