
రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం ( ఫిబ్రవరి 9, 2025 ) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. కాటేదాన్ పారిశ్రామికవాడలో ఉన్న ప్లాస్టిక్ కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో కంపెనీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
ఘటనపై స్థానికులు ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రణష్టమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకొని స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | టిఫిన్ చేసి వచ్చే సరికి రూ.23 లక్షలు మాయం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికుడు