
- ఆగినట్రైన్లో చెలరేగిన మంటలు
- బయటకు పరుగులు తీసిన ప్యాసింజర్లు
- తప్పిన పెను ప్రమాదం
హనుమకొండ: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పక్కనున్న మరో ప్యాసింజర్ ట్రైన్ కు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన టైంలో రైలులో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.