మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో మంటలు చేలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఊరి వరకు మంటలు ప్రవేశించాయి. దీంతో కొత్తగూడ ప్రజలు భయందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆటవీశాఖ కార్యాలయంలో సీజ్ చేసిన 3 టూ వీలర్స్ మంటల్లో దగ్ధమైయ్యాయి. 5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని తెలుస్తోంది. కొత్తగూడ మండల కేంద్రంలో ఆగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.