ఇంట్లో పటాకులు పేలి భార్యాభర్త మృతి

ఇంట్లో పటాకులు పేలి భార్యాభర్త మృతి
  • హైదరాబాద్​ ఓల్డ్​సిటీలో ఘటన

చార్మినార్, వెలుగు: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనుమతి లేకుండా ఓ ఇంట్లో ఉంచిన టపాసులు ఒక్కసారిగా పేలి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన భార్యాభర్తలు మృతి చెందారు. మరో యువతి కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. పోలీసుల ప్రకారం..రైయిన్ బజార్ ఏరియాలోని చంద్ర నగర్ బస్తీలో మోహన్ లాల్ (55), ఉష (50) దంపతులు నివసిస్తున్నారు. దీపావళి సందర్భంగా విక్రయాలు జరిపేందుకు టపాసులు తీసుకు వచ్చి ఇంట్లో నిల్వ ఉంచారు.

సోమవారం రాత్రి మనవరాలు శృతి(20)తో కలిసి వంట చేస్తుండగా టపాసులకు నిప్పు అంటుకుంది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తీవ్ర కాలిన గాయాలైన మోహన్ లాల్, ఉష అక్కడికక్కడే మృతి చెందారు. శృతి గాయాలతో యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా..బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే జఫర్ హుస్సేన్ పరామర్శించారు.తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.