
ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెక్టర్ 110లోని ఓ పెద్ద అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. అపార్ట్ మెంట్ మధ్య అంతస్తులోని ఓ ఫ్లాట్ లోని ఎయిర్ కండిషనర్ ఫేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అగ్నికీలలతో పాటు దట్టమైన పొగలు వస్తున్నాయి. ఈ మంటలు పై అంతస్తుకు కూడా పాకుతున్నాయి. మంటలు గమనించిన ఆపార్ట్మెంట్ వాసులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దట్టమై పొగ పక్క అపార్ట్మెంట్లలోకి కూడా వెళ్తోంది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు వెంటనే అగ్నిమపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనలో ప్రాణ నష్టం వాటిల్లిందా అనే అంశం తెలిసియాల్సి ఉంది.
#WATCH | Uttar Pradesh: Fire broke out at Lotus Boulevard Society in Noida's Sector 100.
— ANI (@ANI) May 30, 2024
(Video Source: Local resident) pic.twitter.com/d3tU4Y4hHx