తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఎర్రమిరెడ్డిపాలెం దగ్గర ఎస్టేట్ మార్గంలో ఓ ప్రైవేట్ వేస్టేజ్ ప్లాస్టిక్ చిప్స్ కటింగ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ప్రమాదంలో భారీగా ఆస్థినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు, పొగ వ్యాపించడంతో.. స్థానికులకు భయాందోళనకు గురయ్యారు.