
కామారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ అనే వ్యక్తికి వాట్సప్ నంబర్ కు పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయంటూ మెసేజ్ పంపించారు సైబర్ కేటుగాళ్లు. నిర్దేశించిన టాస్క్ లను గడువులోగా పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని ఆశ చూపించారు సైబర్ కేటుగాళ్లు. టాస్కులను పూర్తి చేయడంతో శ్రీకాంత్ అకౌంట్ కు అమౌంట్ పంపారు సైబర్ కేటుగాళ్లు. దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మిన శ్రీకాంత్ టాస్క్ లను పూర్తిచేసి ఎక్కువ అమౌంట్ వస్తుందని ఆశపడ్డాడు. దీంతో శ్రీకాంత్ టెలిగ్రామ్ అకౌంట్ కు ఓ లింకును పంపారు సైబర్ కేటుగాళ్లు. వివిధ దపాలుగా కలిపి రూ. 9 లక్షల79 వేలను అకౌంట్ ను అకౌంట్ లో జమ చేశాడు శ్రీకాంత్. అనంతరం అమౌంట్ డెబిట్ అయినట్లుగా శ్రీకాంత్ మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.