హైదరాబాద్లో చిట్ఫండ్ పేరు భారీమోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో కస్టమర్లనుంచి కోట్లలో డబ్బు వసూలు చేసి కనిపించకుండా పోయారు. అనుమానం వచ్చిన కస్టమర్లు ఆరాతీయగా మోసపోయినట్లు తెలుసుకొని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్లో సోమశేఖర్ పిన్కోడ్ చిట్ ఫండ్స్ పేరుతో రూ. 2కోట్ల 65 లక్షలు వసూలు చేసిన పరారయ్యారు నిందితులు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా చిట్ ఫండ్స్ కంపెనీ నడుపుతున్నారు నిందితులు. నెలవారీ చిట్టీల పేరుతో కస్టమర్లనుంచి భారీగా వసూలు చేశారు.
ALSO READ | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ పెబ్బేరు కమిషనర్ ఆదిశేషు
ఒక్కో కస్టమర్ల దగ్గర రూ. 2లక్షల నుంచి రూ. 5లక్షల వరకు వసూలు చేశారు. అయితే ఇటీవల చిట్ ఫండ్ మూసి ఉండటంతో కస్టమర్లకు అనుమానం వచ్చింది. మోసపోయినట్లు తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు.
సోమశేఖర్ పిన్ కోడ్ చిట్ ఫోన్స్ పేరుతో రూ. 2కోట్ల 65లక్షలతో ఉడాయించారని సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రధాన నిందితుడు సీతారామయ్యను మంగళవారం ( అక్టోబర్ 22) నందిగామ వద్ద అరెస్ట్ చేశారు.