ఎయిర్ పోర్టులో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో ఘరానా మోసం

ఎయిర్ పోర్టులో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో  ఘరానా మోసం

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో నిరుపేదల టార్గెట్ గా మోసాలకు పాల్పడింది  ఓ సంస్థ. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి డబ్బులు కాజేసింది. డబ్బులు తీసుకుని మోహం చాటేయడంతో పీఎస్ లో  బాధితులు ఫిర్యాదు చేయడంతో  ఆ సంస్థ అసలు భాగోతం బయటపడింది.

 కూకట్ పల్లికి చెందిన  లక్కీ సెక్యూరిటీ అనే సంస్థ ఎయిర్ పోర్ట్ హౌస్ కీపింగ్, సూపర్ వైజర్ ఉద్యోగాలంటూ  లెనిన్ నగర్ లో రెండు నెలల క్రితం మీటింగ్ ఏర్పాటు చేసింది.  ఆ సంస్థ ఎండిగా చలామణి అవుతున్న మల్లేష్  జిహెచ్ఎంసి, ఎయిర్ పోర్ట్ లో జాబులు ఇప్పిస్తానంటూ బాధితుల దగ్గర రూ. 2 వేల రూపాయల నుంచి రూ. 7వేల వరకు వసూలు చేశాడు. ఇలా కొందరు అమాయక ప్రజల నుంచి  రూ.4లక్షల వరకు వసూలు చేశాడు.

ఉద్యోగంలో చేరక ముందే వాళ్లకు నకిలీ ఐడి కార్డులు యూనిఫాంలో అందజేశారు ఇలా కొన్ని రోజులు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో  అసలు  తమకు  జాబులు ఎప్పుడు వస్తాయని నిలదీశారు బాధితులు . ఇలా రోజుల తరబడి ముఖం చాటేస్తూ తిరుగుతున్నారు సిబ్బంది. దీంతో బాధితులు లక్కీ సంస్థ ప్రతినిధులపై మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  మరోసారి ఇలాంటి మోసాలకు పాల్పడకుండా నిందితుని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు.