సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్(డీఎస్టీ)కి రూ.28,508 కోట్లు బడ్జెట్లో అలకేట్ చేశారు. ఇందులో రూ.20 వేల కోట్లు గత బడ్జెట్లో ప్రకటించిన ‘రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫండ్’ అమలు కోసం వినియోగించనున్నట్టు వెల్లడించారు.
మొత్తంగా గత బడ్జెట్ తో పోలిస్తే సైన్స్అండ్ టెక్నాలజీకి ఈసారి రూ.12 వేల కోట్లు అదనంగా నిధులు దక్కాయి. బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్కు రూ.3,446 కోట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్‌కు రూ.6,657 కోట్లు ఇచ్చారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో వివిధ శాఖలకు రూ.55,679 కోట్లు కేటాయించారు. అణుశక్తి శాఖకు రూ.24 వేల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు రూ.3,649 కోట్లు అలకేట్ చేశారు.