అత్తాపూర్లో భారీ చోరీ

రంగా రెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  పాండురంగా నగర్ లో అశోక్ బిరాదర్(41) అనే ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లో ఈ చోరీ జరిగింది. జనవరి 5వ తుదీ శుక్రవారం అశోక్ ఆఫీస్ వెళ్లగా.. ఆయన భార్య రేష్మా ఇంటికి తాళం వేసి.. మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లలు వస్తారని, వాళ్ళ కోసం ఇంటి తాళం చెవి,  పక్కింటి వాళ్ళకి ఇచ్చి వెళ్ళారు.

అయితే, ఈరోజు(జనవరి 6వ తేదీ శనివారం) వాళ్లు ఇంటి  బీర్వాను తెరచి చూడగా.. బీర్వాలో ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఖంగు తిన్నారు. తమ బంగారాన్ని ఎవరో దొంగలించారని ఆరోపిస్తూ అత్తాపూర్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీమ్ బృందంతో చేరుకుని  ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.