
హైదరాబాద్లో మరోసారి హవాలా డబ్బు కలకలం రేపింది. ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ టెక్డీ దగ్గర పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా హవాలా డబ్బు పట్టుబడింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల దగ్గర భారీగా నగదు చేసుకున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు.
బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అనుమానం వచ్చి తనఖీ చేయగా.. వారిదగ్గర భారీగా నగదు దొరికింది. బ్లాక్ కవర్ లో దాచి రూ. 4.50వేల నగదును తరలిస్తుండగా సీజ్ చేశారు. ఆ నగదును ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ అధికారులకు అప్పజెప్పారు సుల్తాన్ బజార్ పోలీసులు. వారినుంచి రెండు బైక్ లు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.