జపాన్ విమానాశ్రయం రన్‌వేపై భారీ రంధ్రం..80 విమానాలు రద్దు

జపాన్ విమానాశ్రయం రన్‌వేపై భారీ రంధ్రం..80 విమానాలు రద్దు
  • వరల్డ్ వార్–2 నాటి బాంబు ఇప్పుడు పేలింది

టోక్యో: జపాన్​లో రెండో ప్రపంచ యుద్ధంకాలంనాటి ఓ బాంబు పేలింది. మియాజాకీ​ ఎయిర్​పోర్ట్​ రన్​ వేలో పాతి పెట్టిన బాంబు బుధవారం ఒక్కసారిగా పేలగా.. అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో 80 విమానాలు రద్దయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే, ఆ సమయంలో రన్​ వేపై విమానాలు లేకపోవడంతో ప్రమా దం తప్పిందని ల్యాండ్​ అండ్​ ట్రాన్స్​పోర్ట్ మినిస్ట్రీ వెల్లడించింది.

 రెండో ప్రపంచ  యుద్ధ సమయంలో ఈ బాంబును అమెరికా ఇక్కడ విడిచినట్టు అధికారులు గుర్తించారు. అకస్మాత్తుగా అది ఎందుకు పేలిందో  కనుక్కొనే పనిలో నిమగ్నమయ్యారు.