రాజన్న ఆలయానికి 21 రోజుల్లో రూ.2.21 కోట్ల ఆదాయం

రాజన్న ఆలయానికి 21 రోజుల్లో రూ.2.21 కోట్ల ఆదాయం

వేములవాడ, వెలుగు : రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది. మంగళవారం హుండీ లెక్కించగా 2కోట్ల 21లక్షల 29వేల నగదు, 463 కేజీల బంగారం, 19.8కేజీల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. లెక్కింపులో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్,  శ్రీ రాజ రాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.