శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఆదాయం.. 26 రోజుల్లో ఎంత వచ్చిందంటే..?

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఆదాయం.. 26 రోజుల్లో ఎంత వచ్చిందంటే..?

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు 2024, నవంబర్ 19న అధికారులు చేపట్టారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా.. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4 కోట్ల 14 లక్షల 15 వేల 623 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 26 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు వెల్లడించారు. ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 322 గ్రాముల 300 మిల్లి గ్రాములు బంగారం.. అలాగే వెండి 8 కేజీల 500 గ్రాములు వచ్చిందని పేర్కొన్నారు.

నగదు, బంగారుతో పాటు యుఎస్ డాలర్లు 739, యూఏఈ దిర్హమ్సు 50, ఈరోస్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 135,  కెనడా డాలర్లు 100, సింగపూర్ డాలర్లు 205, కత్తారు రియాల్స్ ఓమన్ రియాల్స్ 2,  ఓమన్ బైసా 600, మలేషియారింగిట్స్ 2, బహ్రెన్ దినార్ 1, ఘనా సీడిస్ 200, ఉగాండ షిల్లింగ్సు 1000, జపాన్ యన్స్ 116, మెక్సికో పిసో 1020 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ కానుకగా వచ్చిందని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది,శివ సేవకులు పాల్గొన్నారు.