- శ్రావణ మాసంలో 5 లక్షల మంది భక్తుల రాక
- ఆలయ ఈఓ వినోద్ రెడ్డి వెల్లడి
వేములవాడ, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి శ్రావణ మాసంలో భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో పాటు ఏపీ, మహారాష్ర్ట, చత్తీస్ ఘడ్నుంచి వచ్చిన సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. గత నెల 5 నుంచి ఈనెల 2 వరకు సుమారు నెల రోజుల్లో స్వామివారికి 6 కోట్లు 87 లక్షల 22 వేల ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈఓ వినోద్ రెడ్డి బుధవారం తెలిపారు. కోడెమొక్కు ద్వారా 1 కోటి79 లక్షల 61 వేలు, లడ్డూ ప్రసాదాల ద్వారా 1 కోటి 53 లక్షల 60 వేల 380 రూపాయలు
హుండీలో 1 కోటి 31 లక్షల 19 వేల 460 రూపాయలు, ఆర్జిత సేవల ద్వారా రూ. 69 లక్షల 20 వేల 610 రూపాయలు, దర్శనాల ద్వారా రూ. 25,94 ,800, కల్యాణ టిక్కెట్ల ద్వారా రూ. 34,44 లక్షలు, కేశఖండనం రెండు కౌంటర్ల ద్వారా రూ. 15, 23,202, అభిషేకాల ద్వారా రూ. 21,16 ,500, వసతి గదుల అద్దె ద్వారా రూ. 43,80 ,497 వచ్చాయి. బద్దిపోచమ్మ ఆలయ సేవల టికెట్ల ద్వారా రూ. 9, 92 ,195, శాశ్వత పూజలు, డొనేషన్ల ద్వారా రూ. 3 ,09, 362 సమకూరినట్లు ఆలయ అధికారులు వివరించారు.