వేములవాడ రాజన్నకు భారీ ఆదాయం

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం(ఫిబ్రవరి 7) ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిపోయాయి. సాధారణంగా భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకున్న అనంతరం వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే రద్దీ పెరిగింది. 

గత 14 రోజులుగా భక్తులు రికార్డు స్థాయిలో స్వామి వారికి కానుకలు సమర్పించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం హుండీని లెక్కించగా.. భారీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. రూ. 2 కోట్ల 15 లక్షల 67 వేయి రూపాయిల నగదు, 71 గ్రాముల 500 మీల్లీ గ్రాముల బంగారం, 13 కిలోల 600 గ్రాముల వెండి స్వామి వారికి కానుకలుగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.