వరంగల్ వెజిటెబుల్ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గత 15 రోజులుగా కూరగాయల ధరలు రెండింతలు అయ్యాయి. టమాట ధర ఏకంగా సెంచరీని దాటింది. హోల్ సెల్ మార్కెట్ లో 80 రూపాయలు పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్ లో ఏకంగా వందరూపాయలకు చేరింది. పెరుగుతున్న టమోటా ధరతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూరగాయల పంటలు దెబ్బతినటంతో ...రేట్లు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. టమాట ట్రాన్స్ పోర్ట్ దెబ్బతినడం వల్ల రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వర్షాల కారణంగా దిగుమతి తగ్గిందని రైతులు అంటున్నారు.