
అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే 11 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 9970
పోస్టు: అసిస్టెంట్ లోకో పైలట్(ఏఎల్పీ)
ఆర్ఆర్బీ రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు:
సికింద్రాబాద్–1500, రాంచీ– 1213, భువనేశ్వర్– 928, అజ్మీర్– 820, ముంబయి– 740, కోల్‌కతా–720, భోపాల్– 664, ప్రయాగ్ రాజ్ –588, బిలాస్ పూర్–568, అహ్మదాబాద్–497, చండీగఢ్–433, మాల్దా–432, చెన్నై–362, తిరువనంతపురం–148, గోరఖ్‌పూర్–100, సిలిగురి–95, ముజఫర్ పూర్–89, పట్నా–33, గువాహటి–30, జమ్మూకశ్మీర్–08.
ఎలిజిబిలిటీ:
పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్ లేదా పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్‌లో మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు. 2025, జులై 1 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 12.
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 11.
అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు ఫీజు రూ.250.
సెలెక్షన్ ప్రాసెస్
ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్–2025 ఉద్యోగానికి ఎంపిక కావాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–2, సీబీఏటీ(సైకో టెస్ట్)లోఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. సీబీటీ–1, సీబీటీ–2లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్(పదో తరగతి స్థాయి), జనరల్ అవేర్ నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, బేసిక్ సైన్స్, ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సీబీటీ–1 ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1లో మొత్తం 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారు. 60 నిమిషాల వ్యవధిలో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ (20 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 మార్కులు), జనరల్ సైన్స్ (20 మార్కులు), జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్(10 మార్కులు) నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు1 మార్క్. ప్రతి తప్పుడు జవాబుకు 1/3వ వంతు మార్కును కోత విధిస్తారు. సీబీటీలో క్వాలిఫై కావాలంటే అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ(ఎన్ సీఎల్) 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులు సీబీటీ–2కు ఎంపిక చేస్తారు.
సీబీటీ–2 ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-–2లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పేపర్–2లో 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటాయి. సంబంధిత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. పేపర్–1 ఎగ్జామ్ 90 నిమిషాలు, పేపర్–2 ఎగ్జామ్ 60 నిమిషాల సమయం ఇస్తారు. మొత్తం 175 ప్రశ్నలకు 150 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు జవాబుకు 1/3వ వంతు మార్కును కోత విధిస్తారు. పేపర్–1లో ఉత్తీర్ణత సాధించాలంటే అన్ రిజర్వ్ డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం, ఓబీసీ(ఎన్ సీఎల్) 30 శాతం, ఎస్సీ 30 శాతం, ఎస్టీ అభ్యర్థులు 25 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పేపర్–2లో అన్ని కేటగిరీల అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పేపర్–1లో సాధించిన స్కోర్ ఆధారంగానే సీబీఏటీ ఎగ్జామ్ కు ఎంపిక చేస్తారు.
సీబీఏటీ(సైకో టెస్ట్)
మెమోరీ టెస్ట్, ఫాలోయింగ్ డైరెక్షన్ టెస్ట్, డెప్త్ప్రిసెప్షన్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ , పర్సప్షనల్ స్పీడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సీబీటీ–1 సిలబస్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–1లో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి.
మ్యాథమెటిక్స్
మెన్స్యురేషన్, నంబర్ సిస్టమ్, బాడ్మస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సీఎం అండ్ హెచ్ సీఎఫ్, పర్సంటేజ్స్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ, ఎలెమెంట్రీ స్టాటిస్టిక్స్, స్క్వైర్రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టర్న్ తదితరాలు.
మెంటల్ ఎబిలిటీ
అనాలజీ, ఆల్ఫబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్ షిప్స్, సిలోజిస్మ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ ప్రెటిషన్ అండ్ సఫిషియెన్సీ, కన్క్లుజన్స్ అండ్ డెసిషన్ మెకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనలైటికల్ రీజినింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అసమ్షన్స్ తదితరాలు.
జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్‌సైన్సెస్. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, అవార్డ్స్, ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్, స్టాక్ జీకే, పర్సనాలిటీస్.