హైదరాబాద్, వెలుగు : యువతీ, యువకుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని ఐటీ మినిస్టర్ శ్రీధర్‌బాబు అన్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగా అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ విశేష కృషి చేస్తున్నదని అన్నారు.
రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని ఫైర్ సర్విసెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శనివారం 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు హాజరై, మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు, విపత్తు సంభవించినప్పుడు బాధితులకు ధైర్యం కల్పించాలని డ్రైవర్ ఆపరేటర్లకు సూచించారు.