ఆప్షన్స్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారీ నష్టాలు

ఆప్షన్స్ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారీ నష్టాలు
  • 2023- 24 లో 73 లక్షల మందికి లాస్ : సెబీ స్టడీ

న్యూఢిల్లీ : ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ) ట్రేడింగ్ చేస్తున్న వారిలో 91 శాతం మంది నష్టాలే చూస్తున్నారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 73 లక్షల మంది రిటైల్ ట్రేడర్లకు నష్టాలే మిగిలాయని  సెబీ స్టడీ వెల్లడించింది. సగటున రూ.1.2 లక్షలు నష్టపోయారని తెలిపింది. గత మూడేళ్లు చూసుకుంటే అంటే 2021–22 నుంచి 2023–24 మధ్య కోటి మంది ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఓ ట్రేడర్లకు నష్టాలే మిగిలాయి. 93 శాతం మంది ట్రేడర్లు సగటున  రూ.2 లక్షలు నష్టపోయారు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా రూ.1.8 లక్షల కోట్లను ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఓ ట్రేడర్లు నష్టపోయారు. 

ఒక్క 2023–24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.75 వేల కోట్లు నష్టపోయారు. ఎక్కువగా నష్టపోయిన టాప్ 3.5 శాతం మంది ట్రేడర్లు సగటున రూ.28 లక్షల నష్టాన్ని చవిచూశారని సెబీ స్టడీ పేర్కొంది. ఇందులో ట్రాన్సాక్షన్ల ఛార్జీల కోసం చేసిన ఖర్చులు కూడా కలిసి ఉన్నాయి.  గత మూడేళ్లలో కేవలం 7.2 శాతం మంది మాత్రమే  ఫ్రాపిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూశారని, ఇందులో కూడా కేవలం ఒక శాతం మంది మాత్రమే ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పోయాక రూ.లక్షకు పైగా ప్రాఫిట్ సాధించారని వివరించింది. మరోవైపు  ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్న రిటైల్ ట్రేడర్లు 2021–22 లో 51 లక్షల మంది ఉంటే 2023–24 లో 96 లక్షలకు పెరిగారు. 

మొత్తం ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ ఓ టర్నోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరి వాటా కేవలం 30 శాతమే ఉన్నా, నెంబర్ పరంగా చూస్తే 99.8 మంది ఇండివిడ్యువల్ ట్రేడర్లే ఉన్నారు.  మరోవైపు రిటైల్ ట్రేడర్లు నష్టపోతుంటే ప్రొప్రయిటరీ ట్రేడర్లు (ఫైనాన్షియల్ సంస్థలు) మాత్రం కిందటి ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా రూ.33,000 కోట్ల ప్రాఫిట్ చూశారు.  ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల) కు రూ.28 వేల కోట్ల ప్రాఫిట్స్  వచ్చాయి.