ఆలేరు చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం

రాష్ట్రంలో ఎలక్షన్ వేళ పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతుంది. యాదాద్రి ఆలేరు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో  భారీగా నగదు పట్టుబడింది. సరియైన పత్రాలు చూపించని 1 కోటీ 26లక్షల యాభై వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అప్పగించారు. పట్టుబడిన నగదు బ్యాంకుకు సంబంధించిన ఏటిఎం డబ్బుగా అధికారులు చెప్తున్నారు.  

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చెక్ పోస్టుల వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారం, వెండి ఆభరణాలతోపాటు భారీగా నగదు పట్టుబడుతోంది. సరైన ఆధారాలు చూపించని నగదు, ఆభరణాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. 

Also Read :- వరదల దెబ్బకు రూ.400 కోట్లు మటాష్​: ఆర్బీఐ షాక్‌