![హైదరాబాద్‌లో క్వాల్‌కామ్‌కు భారీ ఆఫీస్](https://static.v6velugu.com/uploads/2021/02/adc.jpg)
రహేజా పార్కులో 16 లక్షల ఎస్ఎఫ్టీ లీజుకి
హైదరాబాద్: చిప్‌మేకర్, అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ క్వాల్కామ్ హైదరాబాద్‌లో భారీ ఆఫీసు స్పేస్‌ను లీజుకి తీసుకుంది. రహేజా ఐటీ పార్కులో ఏకంగా 16 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్‌ను పదేళ్లపాటు లీజుకు తీసుకుంది. ఈ ఏడాది సిటీలో ఇంత భారీ ఆఫీస్ లీజు ఇదే తొలిసారి! రహేజా మాదాపూర్‌లో నిర్మిస్తున్న కామర్జోన్ను కూడా క్వాల్‌కామ్‌కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. డీల్‌పై సంతకాలు జరిగాయని, అవసరమైతే మరో రెండు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని రహేజా వర్గాలు తెలిపాయి. మొదటి ఐదేళ్లలో చదరపు అడుగుకు రూ.70 చొప్పున చెల్లిస్తుంది. ఐదేళ్ల తరువాత ఇది 15 శాతం పెరుగుతుంది. క్వాల్‌కామ్‌కు ఇది వరకే ముంబై, బెంగళూరు, ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఆఫీసులు ఉన్నాయి.