ఆర్గానిక్​ అగ్రి ప్రొడక్ట్స్ ఎగుమతికి బోలెడు అవకాశాలు

ఆర్గానిక్​ అగ్రి ప్రొడక్ట్స్ ఎగుమతికి బోలెడు అవకాశాలు

న్యూఢిల్లీ: మన దేశం నుంచి ఆర్గానిక్​ అగ్రి ప్రొడక్టుల ఎగుమతికి చాలా అవకాశాలున్నాయని కామర్స్​ సెక్రటరీ సునీల్​ బర్త్​వాల్​ చెప్పారు. ఆర్గానిక్​ ప్రొడక్టుల మార్కెట్​ గ్లోబల్​గా 135 బిలియన్​ డాలర్లని పేర్కొన్నారు. మన దేశం నుంచి కేవలం 700 మిలియన్​ డాలర్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని అన్నారు. ఆర్గానిక్ ​అగ్రి  ప్రొడక్టుల క్వాలిటీ, స్టాండర్డ్స్​ మెరుగుపరుచుకుంటే ఎగుమతుల మార్కెట్లో మంచి అవకాశాలే ఉన్నాయని వెల్లడించారు. ఆర్గానిక్​ ఫుడ్​ సెగ్మెంట్​ చాలా ముఖ్యమైనదని, ఫోకస్​ పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని కామర్స్​ సెక్రటరీ పేర్కొన్నారు.

 135 బిలియన్​ డాలర్ల గ్లోబల్​ మార్కెట్‌‌‌‌లో మన వాటా 700 మిలియన్​ డాలర్లంటే, చాలా తక్కువని, తప్పనిసరిగా మనం ఫోకస్​ పెంచాలని వెల్లడించారు. ఇండియా ఎక్స్​పో మార్ట్​ వద్ద బయోఫాక్​ ఇండియా ఆర్గానిక్​ ప్రొడక్ట్స్​ ఫెయిర్​ను కామర్స్​ సెక్రటరీ ప్రారంభించారు. ఈ బయోఫాక్​ ఇండియా ఆర్గానిక్​ ప్రొడక్ట్స్​ఫెయిర్​ను ఎపెడా (అగ్రికల్చరల్​ అండ్​ ప్రాసెస్డ్​ ఫుడ్​ ప్రొడక్ట్స్​ ఎక్స్​పోర్ట్​ డెవలప్​మెంట్​ అథారిటీ) నిర్వహిస్తోంది. 

స్టాండర్డ్స్​ తేవాలి.....

ఆర్గానిక్​ ప్రొడక్టులను దిగుమతి చేసుకునే దేశాలలోని స్టాండర్డ్స్​కు అనుగుణంగా మన దేశంలోనూ స్టాండర్డ్స్​ను తీసుకు రావాల్సిన అవసరం ఉందని కామర్స్​ సెక్రటరీ చెప్పారు. ఇండియా ఆర్గానిక్​ లోగో ప్రమోట్​ చేయాలని ఆయన ఈ ఇండస్ట్రీకి పిలుపు ఇచ్చారు. ఫలితంగా గ్లోబల్ ​మార్కెట్‌‌‌‌లో మన ఆర్గానిక్​ ప్రొడక్టులకు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో దొరికే  ఆర్గానిక్ ​ప్రొడక్టుల కోసం ప్రత్యేక క్యాంపెయిన్‌‌‌‌ని ఎపెడా నిర్వహించాలని సూచించారు. ఈ–కామర్స్​ మీడియం వాడుకోవడం ద్వారా ఆర్గానిక్​ ప్రొడక్టుల ఎగుమతులు పెంచుకోవచ్చని పేర్కొన్నారు. 

ఆర్గానిక్​ ప్రొడక్ట్స్​ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం ఒక సమావేశాన్ని త్వరలోనే కామర్స్​ మినిస్ట్రీ నిర్వహిస్తుందని కామర్స్​ సెక్రటరీ హామీ ఇచ్చారు. ఆర్గానిక్​ ప్రొడక్టుల ఎగుమతులు పెంపొందిచడంలో ఎపెడా ముఖ్యపాత్ర పోషిస్తుందని డిపార్ట్​మెంట్​ ఆఫ్​ కామర్స్​ ఎడిషనల్​ సెక్రటరీ రాజేష్​ అగర్వాల్​ చెప్పారు. ఆర్గానిక్​ ఇండస్ట్రీ తమ సమస్యలు పంచుకోవడానికి వీలు కల్పించే ఒక ప్లాట్​ఫామ్​ను కామర్స్​ మినిస్ట్రీ తేనున్నట్లు వెల్లడించారు. దేశంలో ఆర్గానిక్​ సర్టిఫికేషన్​ ఏజెన్సీల సంఖ్య పెంచాలనే పరిశ్రమ డిమాండ్​ను సానుకూలంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 30 దాకా ఆర్గానిక్​ సర్టిఫికేషన్​ ఏజెన్సీలు ఉన్నాయన్నారు. 

పరిశ్రమతో కలిసి పనిచేస్తున్నాం: ఎపెడా

దేశం నుంచి ఆర్గానిక్​ ప్రొడక్టుల ఎగుమతులు పెంచేందుకు ఆ పరిశ్రమతో కలిసి పనిచేస్తున్నట్లు ఎపెడా  చైర్మన్​ అభిషేక్​  దేవ్ ​ వెల్లడించారు. నేషనల్​ ప్రోగ్రామ్​ ఫర్​ ఆర్గానిక్​ ప్రొడక్షన్​ (ఎన్​పీఓపీ) ని ఎపెడా అమలు చేస్తోందని చెప్పారు. సర్టిఫికేషన్​ ఏజెన్సీలకి అక్రిడేషన్​, ఆర్గానిక్​ ప్రొడక్టులకు స్టాండర్డ్స్, ఆర్గానిక్​ సాగు, ప్రొడక్టుల  మార్కెటింగ్​లలో రైతులకు సాయం అందించడం వంటి కార్యక్రమాలను ఎన్​పీఓపీ నిర్వహిస్తోందని వివరించారు. 


ఎన్​పీఓపీ స్టాండర్డ్స్​ను యూరోపియన్​ కమిషన్​, స్విట్జర్లాండ్​లు గుర్తించాయని పేర్కొన్నారు. దేశంలో ఈ ఏడాది మార్చి చివరినాటికి 53,91,793 హెక్టార్లలో ఆర్గానిక్​ ప్రొడక్షన్​ ఎన్​పీఓపీ కింద సాగవుతోందని దేవ్​ వెల్లడించారు. మధ్యప్రదేశ్​ రాష్ట్రం ఆర్గానిక్​ ప్రొడక్షన్​లో మొదటి ప్లేస్​లో నిలుస్తోందని చెప్పారు. ఆ తర్వాత ప్లేస్​లలో మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​, ఒడిషా, కర్నాటక, ఉత్తరాఖండ్​, సిక్కిం, చత్తీస్​గఢ్​, ఉత్తరప్రదేశ్​, జార్ఖండ్​ రాష్ట్రాలు ఉన్నాయని వెల్లడించారు. 

2022–23 లో ఇండియా 2.9 మిలియన్​ టన్నుల ఆర్గానిక్​ ప్రొడక్షన్​ జరిగిందని, ఇందులో ఆయిల్​ సీడ్స్​, సుగర్​కేన్​, మిల్లెట్స్​, మెడిసినల్​ ప్లాంట్స్​, టీ, కాఫీ, పండ్లు, స్పైసెస్​, డ్రైఫ్రూట్స్​, వెజిటబుల్స్​తో పాటు ప్రాసెస్డ్​ ఫుడ్స్​ కూడా ఉన్నాయని దేవ్​ వివరించారు. అదే ఏడాదిలో రూ. 5,525 కోట్ల విలువైన  ఎగుమతులు యూఎస్​, ఈయూ, కెనడా, బ్రిటన్​, స్విట్జర్లాండ్​, ఆస్ట్రేలియా, ఈక్వడార్​, కొరియా, వియత్నాం, జపాన్​ వంటి దేశాలకు జరిగాయని పేర్కొన్నారు.