నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై భారీ గుంతలు

నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై  భారీ గుంతలు

నిజామాబాద్ జిల్లా శివారులోని 16వ నంబర్ జాతీయ రహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. చిన్నాపూర్ గ్రామం మూల మలుపు వద్ద ఉన్న రోడ్డుపై గుంతలు పడుతుంటడంతో ప్రతిసారి ప్యాచ్ వర్క్ తో నెట్టుకొస్తున్నారు.  

వర్షం పడగానే గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్ బీ శాఖ వారు స్పందించి వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి నూతన రోడ్డు వేయాలని కోరుతున్నారు.  

- వెలుగు ఫోటోగ్రాఫర్, నిజామాబాద్