ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా తెలుగోడి సత్తా అంటే ఏంటో చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్, మన తెలుగోడు నితీష్ రెడ్డి భారీ షాట్స్ ఆడుతూ ఫోర్లు, సిక్సులతో మెరుపులు మెరిపించాడు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేప్టటిన హైదరాబాద్ కు పంజాబ్ బౌలర్ హర్ష్ దీప్ సింగ్ షాకిచ్చాడు. ఒకే ఓవర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్, మార్ క్రమ్ లను ఔట్ చేసి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఔట్ కావడంతో ఎస్ఆర్ హెచ్ తీవ్ర ఒత్తడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన నితీష్ పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వికెట్ కాపాడుకోవడానికే ప్రయత్నించాడు నితీష్. దీంతో హైదరాబాద్ ను ఆదుకునే బాధ్యతను స్టార్ బ్యాట్స్ హెన్రీచ్ క్లాసన్ తీసుకుంటాడని అందరూ హోప్స్ పెట్టుకున్నారు.
Also Read : మీ క్షమాపణలు తిరస్కరిస్తున్నాం.. : పతంజలికి సుప్రీంకోర్టు షాక్
అయితే, అతను కూడా ఔట్ కావడంతో సన్ రైజర్స్ పని అయిపోయిందనుకున్నారు. ఈక్రమంలో ఒక్కసారిగా గేర్ మార్చిన నితీష్.. పూనకమొచ్చినట్లు పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ బౌండరీలతో హడలెత్తించాడు. దీంతో 150 పరుగులు చేయడమే గొప్ప అనుకున్న తరుణంలో జట్టు స్కోరు 180కి చేరుకుందంటే.. అది నితీష్ పోరాటం వల్లే జరిగింది. సమద్()తో కలిసి కేవలం 19 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నాడు. మొత్తం 37 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 4 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీస్ మెరుపు ఇన్నింగ్స్ తో ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది.
అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. దీంతో 2 పరుగుల తేడాతో ఎస్ఆర్ హెచ్ ఉత్కంఠ విజయం సాధించింది. ఇక, నితీష్ బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ రాణించాడు. ఒక వికెట్ తీయడంతోపాటు ఒక సూపర్ క్యాచ్ అందుకున్నాడు.
మొత్తంగా సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నితీష్ పై క్రికెట్ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోష్ మీడియాలో నితీష్ రెడ్డిని.. పుష్ప సినిమాలోని అల్లుఅర్జున్ క్యారెక్టర్ తో పోలుస్తూ.. తెలుగోడంటే ప్లవర్ అనుకుంటివా.. పైర్, అసలు తగ్గేదే లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నితీష్ రెడ్డి పేరు మారుమోగుతుండడంతో.. అతని గురించి తెలుకునేందుకు సెర్చ్ చేస్తున్నారు.
నితీష్ రెడ్డి విషయానికి వస్తే.. ఏపీలోని విశాఖపట్నంలో జన్మించాడు. 2017-18లో జరిగిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంద్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. బ్యాటింగ్, బౌలింగ్ తో రాణించాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ సీజన్ 2020లో ఆంధ్ర తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో ఏడు మ్యాచ్‌లలో ఒక సెంచరీ, అర్థ సెంచరీతో 366 పరుగులు చేశాడు. 2021లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ రెడ్డి.. . దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబర్చడంతో బీసీసీ దృష్టిలో పడ్డాడు. ఇక, ఐపీఎల్ 2023 వేలంలో నితీష్ రెడ్డిని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్ లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు.. కేవలం రెండే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు నితీస్ రెడ్డి.