నవమి వేడుకలకు పటిష్ట బందోబస్తు


భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  ఈనెల 30,31తేదీల్లో నిర్వహించే శ్రీరామ నవమి, పట్టాభిషేక మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ డాక్టర్​వినీత్​తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో శుక్రవారం పోలీస్ అధికారులతో ఆయన మాట్లాడారు. వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు, వీఐపీలు వచ్చే అవకాశం ఉందన్నారు. అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాచలానికి వచ్చే రహదారుల్లో ట్రాఫిక్​ సమస్య లేకుండా చూడాలన్నారు. బందోబస్తులో నిర్లక్ష్యం చేస్తే సహించేంది లేదన్నారు. పెండింగ్​కేసుల వివరాలపై చర్చించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. తమ పొలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతి ప్రాంతాన్ని పొలీస్​అధికారులు సందర్శించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి. సాయి మనోహర్, ఏఆర్​అడిషనల్​ఎస్పీ విజయ్ బాబు, భద్రాచలం ఏఎస్పీ పంకజ్​పరితోశ్, డీఎస్పీ రమణ మూర్తి, రాఘవేంద్రరావు, రెహమాన్, నందిరామ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.