![GG చారిటబుల్ హాస్పిటల్‍కు భారీగా క్యూ కట్టిన పేషంట్స్](https://static.v6velugu.com/uploads/2022/09/Huge-queue-of-patients-at-GG-Charitable-Hospital-at-Ram-Nagar-in-Hyderabad_8JndxIbCtr.jpg)
హైదరాబాద్ రాంనగర్ లోని GG చారిటబుల్ హాస్పిటల్ కు పేషంట్స్ భారీగా క్యూ కట్టారు. ఈ హాస్పిటల్ లో ఒక్క రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తుండటంతో భారీగా జనం తరలివస్తున్నారు. DSR & DVR చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదలకు ఒక్క రూపాయితో వైద్య సేవలు అందిస్తున్నారు. పేదలందరికీ వైద్యం అందించాలని ఉద్దేశ్యంతో రూపాయికే 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు. ఇవాళ జనం భారీగా రావడంతో.. హాస్పిటల్ వాల్లే ఫ్రీ గా భోజనం కూడా అందించారు.
ఒక్క రూపాయికే వైద్యం....
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ వైద్యానికి వెళ్ళాలంటే వేలు, లక్షల రూపాయలు కావాల్సిందే. ఓపీ ఫీజుకే వందల్లో వసూలు చేస్తున్నాయి హాస్పిటల్స్. కానీ ఇలాంటి టైంలోనూ ఓ ఛారిటబుల్ ట్రస్ట్ పేదలకు ఒక్క రూపాయితో వైద్యం అందిస్తోంది. వైద్య పరీక్షలను కూడా నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తోంది రాంనగర్ లోని GG హాస్పిటల్.
సాధారణ జ్వరం లాంటి చిన్న రోగాలకైనా డాక్టర్ల దగ్గరకు వెళ్ళాలంటే ఓపీ ఫీజు చెల్లించాల్సిందే. మినిమం రూ.200 నుంచి 500 రూపాయల దాకా ఫీజు కట్టాలి. అయితే రాంనగర్ లోని GG చారిటబుల్ హాస్పిటల్ లో ఒక్క రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క రూపాయితో కనీసం టీ కూడా తాగలేం. అలాంటిది DSR & DVR డీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పేదలకు ఒక్క రూపాయితో వైద్య సేవలు అందిస్తున్నారు...
పేదలందరికీ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రూపాయికే 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్టు సంస్థ చైర్మన్ గంగాధర్ గుప్తా తెలిపారు. గర్భిణులు, పిల్లలు, ఆర్థోతో పాటు ఇతర విభాగాల డాక్టర్లు కూడా జీజీ చారిటీ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ల్యాబ్, ఎక్స్ రే, ఫిజియోథెరపీ, ఐసీయూ, అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలను కూడా తక్కువ ఖర్చుతో చేస్తున్నారు. రోగులు, వారి సహాయకులకు ఉచిత భోజనం, టిఫిన్లు అందిస్తున్నారు. ప్రతి రోజూ 200 మంది వరకు ఇక్కడికి ట్రీట్మెంట్ కి వస్తుంటారు.
రూపాయికి వైద్యం చాలా బాగుందని, మంచి సేవలు అందిస్తున్నారని జనం చెబుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ కి వెళితే నాలుగైదు వేలు ఖర్చు అవుతాయనీ.... అలాంటిది ఒక్క రూపాయిలో ట్రీట్మెంట్ చేయడం సంతోషంగా ఉందంటున్నారు. ఆ ఒక్క రూపాయి కూడా తాము తీసుకోకుండా హుండీలో వేయించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హాస్పిటల్ చుట్టు పక్కల వాళ్ళతో పాటు పేదలందరికీ ఈ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయన్నారు.
చారిటబుల్ ట్రస్ట్ ధ్వారా ఒక్క రూపాయికే సేవలు అందిచడం సంతోషంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ట్రీట్మెంట్ బాగుండటంతో ఎక్కువ మంది పేషెంట్లు వస్తున్నట్టు తెలిపారు. ఒక్క రూపాయి వైద్యంపై జనం ఆనందంగా ఉన్నారనీ... త్వరలో మరిన్ని సేవలను జీజీ చారిటీ హాస్పిటల్ లో పేద ప్రజలకు అందిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.