నల్గొండలో కరెంటు బిల్లులు కట్టేందుకు భారీ క్యూ...

ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్ లలో కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన నేపథ్యంలో నల్గొండ బస్టాండ్​ ఏరియా దగ్గర ఉన్న కరెంట్ ఆఫీస్ వద్ద బిల్లులు కట్టడానికి వినియోగదారులు ఇలా బారులు తీరారు. టీజీఎస్పీడీసీఎల్ యాప్ లోనే చెల్లించాలనే నిబంధన పెట్టడంతో చాలామంది ప్రయత్నించి విఫలమవుతున్నారు. యాప్​ ప్రాసెస్ ​ఈజీగా లేదని, దీంతో కరెంట్​ఆఫీసుకు వచ్చి లైన్లు కడుతున్నామని చెప్పారు.          

-నల్గొండ ఫొటో గ్రాఫర్,​ వెలుగు