
పరిగి, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగిలోని మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టౌన్‌లోని ముస్లింలు నల్ల బ్యాడ్జీలతో అధిక సంఖ్యలో తెలిపారు. జామా మసీద్నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. సీపీఎం నాయకులు వెంకటయ్య , ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద నాయక్ పాల్గొని మద్దతు తెలిపారు.
ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్‌సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ అంటే తమ దృష్టిలో ప్రార్థనా స్థలం అని, కేంద్ర ప్రభుత్వం ముస్లిం హక్కులకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. పార్లమెంటులో సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ను ముస్లింలు ఎన్నటికీ క్షమించరన్నారు. బీఆర్‌ఎస్‌నేత మీర్ మొహమ్మద్అలీ, మాజీ కౌన్సిలర్ మీర్ తాహేర్ అలీ, మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.